కరోనా దూకుడు తగ్గాకే సెట్స్ పైకి 'వీరమల్లు'
- 'భీమ్లా నాయక్' పూర్తిచేసిన పవన్
- 'వీరమల్లు' షూటింగ్ 50 శాతం పూర్తి
- తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేసిన క్రిష్
- ఇప్పట్లో వద్దని వారించిన పవన్
అయితే క్రిస్మస్ సందర్భంగా భార్యను తీసుకుని రష్యా వెళ్లిన పవన్, ఇటీవలే అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. ఈ నెల 15 తరువాత ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఆల్రెడీ గతంలో ఒకసారి పవన్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ఐసోలేషన్ లో ఉన్నారు.
ఈ ఉద్ధృతి ఈ నెలలో మరింత పెరుగుతుందనే సమాచారం ఉండటం వలన, ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశాడు. ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటుందనేది చూసుకుని అప్పుడు మొదలుపెడదామని క్రిష్ తో చెప్పినట్టుగా టాక్. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.