విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి పెళ్లి రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరు
- విశాఖ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్
- ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన మంత్రి అవంతి, మేయర్
- ఎన్ఏడీ ఫ్లైఓవర్ ప్రారంభం
- వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్ కు వెళ్లనున్న సీఎం
ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం జగన్ తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక, రవితేజల పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఏపీ మంత్రులు కూడా ఈ వివాహ విందుకు హాజరయ్యారు. అంతకుముందు సీఎం జగన్ విశాఖ బీచ్ రోడ్డులో విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్య, సుభాష్ ల పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.