పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్

Pawan Kalyan Birthday Wishes from Chandrababu Naidu and Nara Lokesh
  • పవర్‌స్టార్‌గా అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించారన్న చంద్రబాబు
  • రాష్ట్ర పునర్నిర్మాణానికి పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడిన సీఎం
  • పవన్‌ను ‘దేవుడిచ్చిన అన్నయ్య’గా అభివర్ణించిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం వారు 'ఎక్స్' వేదికగా ప్రత్యేక పోస్టులు చేశారు. పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

"ప్రియ మిత్రుడు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పవర్‌స్టార్‌గా అభిమానుల గుండెల్లో మీరు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గిరిజన గ్రామాలకు రహదారుల అనుసంధానం, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలతో ఆయన కీలక సంస్కరణలు తీసుకువస్తున్నారని కొనియాడారు.

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. "దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కల్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. పలు సేవా కార్యక్రమాలతో అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయమని లోకేశ్ పేర్కొన్నారు. 
Advertisement
Pawan Kalyan
Chandrababu Naidu
Nara Lokesh
Janasena Party
Pawan Kalyan Birthday
Andhra Pradesh Politics

More Telugu News