‘బర్త్ టూరిజం’పై ట్రంప్ సర్కార్ కొరడా.. చిన్నారుల పాస్‌పోర్ట్‌లపై కఠిన నిబంధనలు!
- అమెరికాలో పిల్లల పాస్‌పోర్ట్‌లకు కొత్త నిబంధనల ప్రతిపాదన
- తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ హోదాను నిరూపించుకోవాల్సిందే
- ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలులో భాగంగా ఈ చర్యలు
అమెరికాలో జన్మించిన పిల్లలకు పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రక్రియలో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇకపై తమ పిల్లల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ హోదాకు సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఒక ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది. ఈ వివరాలు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ వెలువరించిన ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి వచ్చాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6, 2026న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (ఈవో 14418) అమలులో భాగంగా ఈ కొత్త నిబంధనలను ప్రతిపాదించారు. "బర్త్ టూరిజం"ను అరికట్టడంతో పాటు, అమెరికాలో పుట్టిన వారందరికీ వర్తించే 14వ రాజ్యాంగ సవరణ కింద పౌరసత్వ హక్కులను పరిమితం చేయడమే ఈ ఉత్తర్వుల లక్ష్యం. ఈ ముసాయిదా ప్రకారం, "దరఖాస్తుదారు ఈవో 14418 పరిధిలోకి వస్తారా? లేదా? అని నిర్ధారించడానికి, వారి తల్లిదండ్రుల పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన సమాచారం, ఆధారాలను డిపార్ట్‌మెంట్ కోరుతుంది" అని స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనలకు, ఈ కొత్త ప్రతిపాదనకు మధ్య గణనీయమైన తేడా ఉంది. ఇప్పటివరకు అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్ కోసం, ఆ చిన్నారి అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రులుగా తమ గుర్తింపు పత్రాలు సమర్పిస్తే సరిపోయేది. దరఖాస్తు ఫామ్‌లో తల్లిదండ్రులు తమ పౌరసత్వ వివరాలను ప్రకటించినప్పటికీ, ప్రత్యేకంగా దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉండేది కాదు.
అయితే, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, తల్లిదండ్రులు తమ అమెరికా పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, గ్రీన్ కార్డ్ లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది కేవలం ముసాయిదా దశలోనే ఉందని, ఇంకా తుదిరూపు దాల్చలేదని అధికారులు తెలిపారు. ఒకవేళ ఈ నిబంధనలు అమలైతే, దీనిపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలు లేని తల్లిదండ్రులు, ఇమ్మిగ్రేషన్ అధికారుల చర్యలకు భయపడి తమ పిల్లల పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేయడానికి వెనుకాడే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, "అమెరికా పౌరసత్వం విలువను కాపాడేందుకే" ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.