‘డాడీ గుర్తొస్తున్నావ్’ అంది.. 14 గంటలు ప్రయాణించి కూతురి ముందు వాలిన తండ్రి!
- 8 గంటలు గడిపి, మళ్లీ 14 గంటలు తిరుగు ప్రయాణం
- సోషల్ మీడియాలో వైరల్ అయిన తండ్రి ప్రేమ కథ
- నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ
ప్రేమను మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపించేవారే ఎక్కువ. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమకు ఇది సరిగ్గా సరిపోతుంది. తాజాగా ఓ తండ్రి తన కూతురిపై చూపించిన ప్రేమ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని కూతురు పెట్టిన ఒక్క మెసేజ్‌తో.. ఆయన 14 గంటలు ప్రయాణించి ఆమె ముందు నిలబడ్డారు. కేవలం 8 గంటలు కూతురితో గడిపి, మళ్లీ 14 గంటలు ప్రయాణించి వెనక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. కైవల్య (@apple.kaivalya) అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పంచుకుంది. ఓ రోజు రాత్రి 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని మెసేజ్ చేసింది. ఆ మెసేజ్‌కు ఆయన అంతలా స్పందిస్తారని ఆమె ఊహించలేదు. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీయగానే, బ్యాక్‌ప్యాక్‌తో తండ్రి ఎదురుగా నిలబడి ఉన్నారు.
ఆయన కేవలం 8 గంటల సమయం మాత్రమే తన కూతురితో గడిపారు. ఈ కొద్ది సమయంలోనే ఆయన ఆఫీస్ కాల్స్ మాట్లాడుకుంటూనే, కూతురికి సాయం చేశారు. ఆమె గిన్నెలు శుభ్రం చేయడం, బయటకు తీసుకెళ్లడం, ఆమెకు ఇష్టమైన ఆహారం తినిపించడం వంటి పనులు చేశారు. తిరిగి వెళ్లే ముందు, "నువ్వు ఏం చేసినా సంతోషంగా ఉండు. నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను" అని చెప్పి వెళ్లారు.
దీనిపై కైవల్య ఎమోషనల్ అయింది. "నేను నాన్నను చూడాలని అనుకున్నాను, ఆయన వచ్చారు. పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు, కేవలం ఆయన ఉనికి, చిన్న చిన్న పనులతోనే నాపై ప్రేమను చూపించారు" అని పేర్కొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తండ్రి ప్రేమకు ఫిదా అవుతున్నారు. మాటల కన్నా చేతలే గొప్పవని, తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమకు ఇది నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు.