భారత్ ఇప్పుడు ప్రపంచానికే పాఠాలు చెబుతోంది: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు బంగా
- భారత్ అభివృద్ధి నమూనా ప్రపంచానికి ఆదర్శమన్న అజయ్ బంగా
- డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా నుంచి ఇతర దేశాలు నేర్చుకోవచ్చని వ్యాఖ్య
- వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం మరో కీలక మోడల్
- 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంపై దృష్టి
- యూపీలో రైతుల కోసం టెక్నాలజీ ప్రాజెక్టులను ప్రశంసించిన బంగా
భారత్ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు మరో దేశానికి పాఠంగా మారే స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. భారత్ సాధించిన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకునే అవకాశాలు పెరిగాయని చెప్పారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో భారత్ పొందే స్థానం కూడా కీలకమని బంగా చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధార్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏర్పడిన డిజిటల్ వ్యవస్థను ఇతర దేశాలు అధ్యయనం చేయవచ్చని చెప్పారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రపంచానికి ఉపయోగపడే మరో నమూనా అని అన్నారు.
తాను ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పర్యటించినప్పుడు చిన్న రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్ అందించేందుకు సహకార సంఘాలు, గూగుల్, ప్రపంచ బ్యాంకు కలిసి పనిచేస్తున్న విధానాన్ని చూశానని బంగా తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఈ సేవలను పెద్ద సంఖ్యలో రైతులకు చేరువ చేయడం మంచి ప్రయత్నమని చెప్పారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిజిటల్ వ్యవస్థలతో ప్రాంతీయ ఆసుపత్రులు, వైద్యులతో అనుసంధానించవచ్చని ఆయన వివరించారు. భౌతిక మౌలిక వసతులు, విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, నియంత్రణ సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ వంటి రంగాల్లో భారత్‌తో ప్రపంచ బ్యాంకు కలిసి పనిచేస్తోందన్నారు. పర్యాటకం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా సహకార అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
భారత్ పురోగతిలో నాయకత్వం పాత్రపై ప్రశ్నించగా.. ప్రజలు, నాయకత్వాన్ని విడదీయలేమని బంగా అన్నారు. భారత ప్రజలు సరైన దిశలో నడిపించే నాయకత్వాన్ని ఎంచుకున్నందుకు గర్వపడాలని వ్యాఖ్యానించారు.