Varun Tej: 'గని' నుంచి ఈశ్వర్ నాథ్ గా జగపతిబాబు లుక్!

  • వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గని'
  • దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి పరిచయం 
  • కీలకపాత్రలో సునీల్ శెట్టి 
  • డిసెంబర్ 3వ తేదీన విడుదల   
Ghani jagapathi Babu look released

వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా రూపొందుతోంది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో డాగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, ఈ నెల 15వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3వ తేదీన సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ముఖ్యమైన తారాగణానికి సంబంధించిన వివరాలను అందించడమే కాకుండా, వారు పోషించిన పాత్రల తాలూకు లుక్ ను రోజుకొకటి చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో నదియా పోషించిన 'మాధురి' పాత్రను పరిచయం చేస్తూ నిన్న ఆమె లుక్ ను వదిలారు.

ఇక జగపతిబాబు పోషించిన ఈశ్వర్ నాథ్ పాత్రను పరిచయం చేస్తూ, ఈ రోజున ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. 'శ్రీమంతుడు' .. 'నాన్నకు ప్రేమతో' లుక్స్ కి దగ్గరగా ఆయన లుక్ డీసెంట్ గా ఉంది. ఇక తెరపై ఆ పాత్ర స్వభావమేమిటనేది చూడాలి. ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర కనిపించనున్న సంగతి తెలిసిందే. .

More Telugu News