Varun Tej: ముఖ్యమైన పాత్రలను పరిచయం చేసిన 'గని' టీమ్!

Introducing the characters from the World Of Ghani
షార్ట్స్‌లో చూడండి
వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి ఎం కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన విదేశాలకి వెళ్లి శిక్షణ పొంది వచ్చాడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగు పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నెల 15వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న ఆర్టిస్టుల పేర్లను ఈ సినిమా టీమ్ ఆవిష్కరించింది. ఆ జాబితాలో నదియా .. సీనియర్ నరేశ్ .. తనికెళ్ల భరణి .. నవీన్ చంద్ర .. సునీల్ శెట్టి .. జగపతిబాబు .. ఉపేంద్ర పేర్లు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Varun Tej
Saiee Manjrekar
Jagapathi Babu

More Telugu News