కేటీఆర్... ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా?: రేవంత్ రెడ్డి
- ఫ్రాన్స్ లో కేటీఆర్ పర్యటన
- రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల కోసం ప్రయత్నాలు
- మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగి మహేశ్ ఆత్మహత్య
- తీవ్రస్థాయిలో స్పందించిన రేవంత్ రెడ్డి
ఫ్రాన్స్ నుంచి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నాం అని చెబుతున్నారు. కానీ పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా కేటీఆర్? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగి మహేశ్ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న ఇది అని వెల్లడించారు. ఈ సందర్భంగా యువతకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, మరణం కాదు రణం చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.