ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరు: మంత్రి బాలినేని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరు: మంత్రి బాలినేని

There is no one to speak to Chandrababu in Delhi says Balineni
  • ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తారు?
  • ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదు
  • దేవుడులాంటి ఎన్టీఆర్ ను  చెప్పులతో కొట్టించారు
టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఖరారయింది. తన పర్యటనలో కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెళ్లి ఆయన ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదని చెప్పారు.
 
టీడీపీ కార్యాలయాన్ని దేవాలయం అని చెప్పుకునే చంద్రబాబు... ఆ పార్టీని ప్రారంభించిన దేవుడు ఎన్టీఆర్ ను చెప్పులతో ఎందుకు కొట్టించారని బాలినేని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చరిత్ర గురించి చెపుతుంటే వినేందుకు తమకు అసహ్యం కలుగుతోందని అన్నారు. ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరని ఎద్దేవా చేశారు.
Balineni Srinivasa Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News