కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నటి నివేదా థామస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నటి నివేదా థామస్

Actress Nivetha Thomas climbed Kilimanjaro
  • ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతం కిలిమంజారో
  • కిలిమంజారో ఎత్తు 19,340 అడుగులు
  • ఆరు నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా
  • విజయం సాధించినట్టు సోషల్ మీడియాలో వెల్లడి
తెలుగులోనూ పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ భామ నివేదా థామస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారోను నివేదా థామస్ అధిరోహించింది.

కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కిలిమంజారోను అధిరోహించడం సాహసంతో కూడినది. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా, దాదాపు 6 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా థామస్ తన కల నెరవేర్చుకుంది. నివేదా అభిరుచుల్లో ట్రెక్కింగ్ కూడా ఉంది. కాగా, కిలిమంజారోను అధిరోహించినప్పటి ఫొటోలను నివేదా సోషల్ మీడియాలో పంచుకుంది.
Niveda Thomas
Kilimanjaro
Africa
Mountain
Tollywood

More Telugu News