Akhi: 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Most Eligible Bachelor lyrical song released
షార్ట్స్‌లో చూడండి
అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందింది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఈషా రెబ్బా .. ఫరియా అబ్దుల్లా ముఖ్యమైన పాత్రల్లో మెరవనున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. "అరెరే ఎవరూ ఏం చెప్పలేదా ఒకసారి, ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా" అంటూ ఈ పాట సాగుతోంది. గోపీసుందర్ బాణీకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించగా, జియా ఉల్  హక్ ఆలపించాడు.

విజయదశమి కానుకగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఆమని .. పోసాని .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి అఖిల్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.
Go Back to Shorts
Akhi
Pooja Hegde
Bhaskar

More Telugu News