Varun Tej: 'గని' నుంచి ఫస్టు పంచ్ .. రిలీజ్ డేట్ ఖరారు!

  • వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని'
  • సయీ మంజ్రేకర్ పరిచయం
  • డిసెంబర్ 3వ తేదీన విడుదల
  • షూటింగు దశలో 'ఎఫ్ 3' సినిమా
Gani release date confrimed

బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'గని' అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి పరిచయమవుతున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ మెరవనుంది. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లో పరిచయమవుతోంది.

ముందుగా ఈ సినిమాను 'దీపావళి' కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి 'గని' ఫస్టు పంచ్ పేరుతో ఒక వీడియోను వదిలారు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు.

ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. డిసెంబర్ మాసంలోకి మరో కొత్త సినిమా ఎంటర్ అయింది. ఆ నెలలో కూడా పోటీ గట్టిగానే ఉండనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి చాలా స్పీడ్ గా ఈ సినిమా షూటింగును కానిచ్చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

More Telugu News