Siddaramaiah: సిద్ధరామయ్య మామూలుగానే ఉగ్రవాదిలా కనిపిస్తారు: బీజేపీ కర్ణాటక చీఫ్

24 Hindus killed under Siddaramaiahs Talibani administration Nalinkumar
  • సిద్ధరామయ్యది తాలిబన్ల సంస్కృతి
  • ఆయన హయాంలోనే రాష్ట్రంలో అత్యధిక హత్యలు
  • కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారడంతోనే సహనం కోల్పోతున్నారు
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ తాలిబన్ ఉగ్రవాదులతో పోల్చారు. సిద్ధరామయ్యది తాలిబన్ల సంస్కృతి అని, ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక హత్యలు జరిగాయని ఆరోపించారు.

ఆయన ఇంత ఘాటుగా స్పందించడానికి కారణం ఆదివారం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలే. బీజేపీ ఓ అబద్ధాల పుట్ట అని, అబద్ధాలను మార్కెటింగ్ చేయడంలో వారు సిద్ధహస్తులని, వారిది తాలిబన్లు, హిట్లర్ వారసత్వమని సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. ఇటీవల కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆరెస్సెస్ చేతిలో బీజేపీ కీలుబొమ్మ అని, ఆరెస్సెస్ ఆదేశాలతోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.

ఆయన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన నళిన్‌కుమార్  ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య మామూలుగానే ఉగ్రవాదిలా కనిపిస్తారని అన్నారు. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీపక్‌రావ్, శరత్ మదివాలా, ప్రశాంత్ పూజారీ వంటివారి హత్యలు జరిగాయని గుర్తు చేశారు. 24 మంది హిందూ కార్యకర్తలు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండడంతో సహనం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నళిన్‌కుమార్ దుయ్యబట్టారు.
Siddaramaiah
Karnataka
Congress
BJP
Nalin Kumar Kateel

More Telugu News