జైలు నుంచి ఇంటికి వచ్చిన భర్త.. శిల్పాశెట్టి తాజా స్పందన!
- పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా
- కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇంటికి చేరుకున్న వైనం
- కష్టాలు మనల్ని బలవంతులుగా మారుస్తాయన్న శిల్ప
'బాధలు, కష్టాలు మనలను బలవంతులుగా మారుస్తాయి. వాటి నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. మనలో ఉన్న బలాలు మనకు తెలియకపోవచ్చు. కానీ, కష్టాలు మనలోని బలాలను వెలికితీస్తాయి. అందరిలాగానే కష్ట కాలాన్ని నేను కూడా ద్వేషిస్తాను. అయితే కష్టాలను ఎదుర్కొనే బలం, వాటి నుంచి కోలుకునే స్థైర్యం నాకు ఉన్నాయనే విషయం నాకు తెలుసు' అని శిల్పాశెట్టి అన్నారు.