త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మహిళ.. వీడియో వైరల్
- ముంబైలో ఘటన
- కదులుతోన్న రైలు ఎక్కబోయిన మహిళ
- జారి రైలు కింద పడబోయిన వైనం
- రక్షించిన తోటి ప్రయాణికుడు
అయితే, రైలు ఆగి ఉన్న సమయంలో ఆమె అందుకోలేకపోయింది. రైలు కదులుతుండగా పరుగున అక్కడకు వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నించింది. ఇంతలో జారి రైలు కింద పడబోయింది. వెంటనే అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆమెను ప్లాట్‌ఫాం పైకి లాగాడు.
మరికొంత మంది కూడా అక్కడకు వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ముంబై రైల్వే స్టేషన్‌లో తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.