Shilpa Shetty: నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు: శిల్పాశెట్టి

  • పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా
  • తాను షూటింగుల్లో బిజీగా ఉండేదాన్నని చెప్పిన శిల్పాశెట్టి
  • హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్స్ గురించి తనకు తెలియదని వ్యాఖ్య
I dont know what my husband was doing says Shilpa Shetty

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో శిల్పాశెట్టిని ముంబై పోలీసులు సాక్షిగా చేర్చారు. ఈ నేపథ్యంలో తన భర్త ఏం చేస్తుండేవాడో తనకు తెలియదని పోలీసులకు శిల్పాశెట్టి తెలిపింది.

 తాను షూటింగుల్లో బిజీగా ఉండేదాన్నని... అందువల్ల తన భర్త ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్స్ ల గురించి కూడా తనకు తెలియదని తెలిపారు. ఈ కేసులో మొత్తం 1400 పేజీల చార్జ్ షీట్ ను పోలీసులు ఫైల్ చేశారు. శిల్పాశెట్టి స్టేట్మెంట్ ను కూడా ఈ చార్జ్ షీట్ లో పొందుపరిచారు. జులై 19 నుంచి రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది.  

More Telugu News