ఒకసారి ఆ పని చేస్తే జనం ఎగబడతారు.. ఆధార్ సంఖ్యను మార్చలేం: స్పష్టం చేసిన 'ఉడాయ్'
- తన ఆధార్ సంఖ్యను మార్చాలంటూ కోర్టుకెక్కిన వ్యాపారి
- ఒకసారి చేస్తే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడతారు
- ఆధార్ సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందన్న ఉడాయ్
తన ఆధార్ నంబరు గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానం కావడంతో ఇబ్బందులు వస్తున్నాయని, కాబట్టి తనకు మొదట కేటాయించిన నంబరును రద్దు చేసి కొత్తది కేటాయించేలా ఉడాయ్‌ను ఆదేశించాలని కోరుతూ ఓ వ్యాపారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ విచారణకు రాగా, ఉడాయ్ తరపున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డుదారులు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి తెలిపారు.