వీర్యం నింపిన సిరంజితో మహిళను పొడిచిన వ్యక్తికి అమెరికాలో పదేళ్ల జైలు శిక్ష!

10-09-2021 Fri 08:44
  • తొలుత 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
  • నిందితుడి ఇంటి నుంచి సిరంజిలు స్వాధీనం
  • 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లిన స్టీమెన్
Amrican Court Order 10 year jail to a man who attacked with sperm

వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చిన ఓ వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా న్యాయస్థానం తాజాగా దానిని పదేళ్లకు తగ్గించింది. ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ (52) ఈ ఏడాది ఫిబ్రవరిలో విపరీత చర్యకు పాల్పడ్డాడు. కిరాణా దుకాణంలోకి వచ్చిన ఓ మహిళకు స్టీమెన్ వెనక నుంచి సిరంజిని గుచ్చాడు. ఆమెకు చురుక్కుమనడంతో ఏదో కుట్టిందని భావించిన బాధిత మహిళ నిందితుడిని ప్రశ్నించింది. దీనికి అతడు సిగరెట్‌తో కాల్చినట్టు చెప్పాడు. అయితే, అంతలోనే పురుగు కుట్టినట్టు ఉంటుందని నిందితుడు చెప్పినట్టు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ఆ తర్వాత విచారణలో అతడు వీర్యం నింపిన సిరంజితో దాడి చేసినట్టు తేలింది. అంతేకాదు, మరో ఇద్దరు మహిళలపైనా స్టీమెన్ ఇలానే దాడికి యత్నించినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, తన ముందు నడుస్తున్న 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు. స్టీమెన్ ఇంటిని తనిఖీ చేసిన సమయంలో ద్రవంతో కూడిన ఓ సిరంజిని పోలీసులు గుర్తించారు. 9 సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్టీమెన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తొలుత అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఈ శిక్షను పదేళ్లకు కుదిస్తూ తుదితీర్పు వెలువరించింది.