విజ‌య‌సాయిరెడ్డి జోకుల‌కు ప్ర‌జ‌లంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారు: బుద్ధా వెంక‌న్న‌

budda venkanna slams vijaya sai reddy
  • భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డితే ఫిర్యాదు చేయాల‌ని అన్నారు
  • విజ‌య‌సాయిరెడ్డే అవినీతికి పాల్ప‌డ్డారు
  • జ‌గ‌దాంబ సెంట‌ర్‌లో చ‌ర్చ‌కు రావాలి
వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న మండిప‌డ్డారు. ఇటీవ‌ల విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న‌ ప్ర‌స్తావించారు. ఈ రోజు బుద్ధా వెంక‌న్న మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎవ‌రైనా భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డితే ఫిర్యాదు చేయాల‌ని విజ‌య‌సాయ‌రెడ్డి అన్నారని, ఆ జోకుల‌కు ప్ర‌జ‌లంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారని బుద్ధా వెంక‌న్న ఎద్దేవా చేశారు.

ఓ ప‌క్క అవినీతికి పాల్ప‌డుతూ, మ‌రోప‌క్క ఫిర్యాదులు చేయాలంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. విజ‌య‌సాయిరెడ్డి అవినీతిపై జ‌గ‌దాంబ సెంట‌ర్‌లో చ‌ర్చ‌కు సిద్ధమ‌ని, ఆయ‌న అక్క‌డ‌కు రావాల‌ని స‌వాలు విసిరారు.
Go Back to Shorts
Budda Venkanna
Telugudesam
Vijayasai Reddy

More Telugu News