తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు!

Heavy Rains forecast in telangana today and tomorrow
  • రాష్ట్రంలో సాధారణంగా రుతుపవన కదలికలు
  • ఒడిశా తీరం వద్ద అల్పపీడనం
  • మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల్లో అస్థిరత ఏర్పడి దక్షిణంవైపుగా వీస్తున్నట్టు తెలిపింది.

బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద నిన్న అల్పపీడనం ఏర్పడగా, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Go Back to Shorts
Telangana
Rains
Bay Of Bengal

More Telugu News