Sunil Narang: తెలంగాణ ఫిలిం చాంబర్ కొత్త కార్యవర్గం... అధ్యక్షుడిగా సునీల్ నారంగ్

  • హైదరాబాదులో నేడు సర్వసభ్య సమావేశం
  • అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక
  • కార్యదర్శులు, కమిటీ సభ్యుల ఎన్నిక
  • రెండేళ్ల పాటు అధికారంలో నూతన కార్యవర్గం
Sunil Narang elected as Telangana State Film Chamber Of Commerce president

తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. నారంగ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇవాళ హైదరాబాదులో తెలంగాణ ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫిలిం చాంబర్ కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా, వీఎల్ శ్రీధర్, ఇన్నారెడ్డి, బాల గోవిందరాజ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఇతర కార్యవర్గం వీరే...

  • కె.అనుపమ్ రెడ్డి-కార్యదర్శి
  • జె.చంద్రశేఖర్ రావు-సంయుక్త కార్యదర్శి
  • ఎం.విజయేందర్ రెడ్డి-ట్రెజరర్
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు...

  • బి.విజయ్ కుమార్
  • ఎం.నరేందర్ రెడ్డి
  • కె.అశోక్ కుమార్
  • బి.లింగం గౌడ్
  • రవీంద్ర గోపాల్
  • చెట్ల రమేశ్
  • పి.సుబ్రహ్మణ్యం
  • ఎం.మోహన్ కుమార్
  • బి.సత్యనారాయణ గౌడ్
  • డి.విష్ణుమూర్తి
  • జి.శ్రీనివాస్ రెడ్డి
  • రవీంద్ర గోపాల్
  • కె.ఉదయ్ కుమార్ రెడ్డి

More Telugu News