రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు
- ఇటీవల పోర్న్ చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్
- కోర్టు రిమాండ్ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన కుంద్రా
- తనను విడుదల చేయాలని విజ్ఞప్తి
- తాము జోక్యం చేసుకోలేమన్న బాంబే హైకోర్టు
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు... మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల్లో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. రాజ్ కుంద్రాకు విధించిన రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీ చట్టానికి లోబడే ఉన్నాయని, ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులేమీ లేవని జస్టిస్ ఏఎస్ గడ్కరీ ధర్మాసనం స్పష్టం చేసింది.