వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కు 10 రోజుల సీబీఐ కస్టడీ

Ten days CBI custody for Sunil Yadav
  • రెండేళ్ల కిందట వివేకా హత్య
  • కీలక అనుమానితుడిగా సునీల్ యాదవ్
  • ఇటీవల గోవాలో అరెస్ట్
  • కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు సునీల్ యాదవ్ కు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సునీల్ ను గోవాలో అరెస్ట్ చేయగా, ఈ నెల 4 నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ కుమార్ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.  
Go Back to Shorts
Sunil Yadav
CBI Custody
YS Vivekananda Reddy
Murder Case

More Telugu News