అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై మరో నటి ఫిర్యాదు
- స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న ముంబై పోలీసులు
- ప్రైవేటు భాగాలు చూపించొద్దని కుంద్రాకు చెప్పిన నటి
- అయితే, మార్పులు చేయకుండా వీడియోను విడుదల చేసిన కుంద్రా
ఆమె స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె మల్వాణీ పోలీస్‌స్టేషన్‌లో కుంద్రాపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నారు. రాజ్‌కుంద్రా తనను మోసం చేశాడని ఆమె తెలిపింది.
రాజ్‌కుంద్రాతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తన ప్రైవేట్ పార్ట్స్‌ని వీడియోలో చూపించకూడదనే షరతుతో ఓ అశ్లీల చిత్రంలో తాను నటించానని, అయితే రాజ్‌కుంద్రా మాత్రం మార్పులు చేయకుండా పూర్తి వీడియోని హాట్‌షాట్స్‌లో విడుదల చేశారని ఆమె ఆరోపించింది. ఈ విషయం తనకు తన స్నేహితుడి ద్వారా తెలిసిందని తెలిపింది.