దీపావళికి బరిలోకి దిగుతున్న వరుణ్ తేజ్ 'గని'

05-08-2021 Thu 18:17
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ  
  • 'గని' పాత్ర కోసం గట్టి కసరత్తు 
  • కీలక పాత్రలో సునీల్ శెట్టి 
  • తమన్ సంగీతం ప్రత్యేకం
Ghani movie wiil release on Diwali

వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని' రూపొందుతోంది. అల్లు బాబీ .. సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లినప్పటికీ, పక్కా ప్లానింగుతో షూటింగు కొనసాగుతోంది. ఇప్పటికే చాలావరకూ షూటింగు కానిచ్చేశారు.

ఇక ఈ సినిమాను దీపావళికి థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాక్సర్ 'గని' పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంతగా కసరత్తు చేశాడనేది ఈ పోస్టర్ ను చూస్తే అర్థమైపోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనువిందు చేయనుంది.

కీలకమైన పాత్రలలో సునీల్ శెట్టి .. ఉపేంద్ర కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వరుస హిట్లతో ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా మరింత ఊపునిస్తుందేమో చూడాలి. ఇక వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 3' సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే.