శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరించి కోర్టు
- రాజ్ కుంద్రాకు బిగుస్తున్న ఉచ్చు
- కుంద్రాతో పాటు, ఆయన సహచరుడు ర్యాన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
- పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా
మరోవైపు రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఆయనతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పే బెయిల్ పిటిషన్ ను కూడా నిరాకరించింది. రాజ్ కుంద్రా కస్టడీని నిన్ననే మరో రెండు వారాల పాటు కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని కోర్టు పొడిగించడం ఈ వారంలో ఇది మూడోసారి. రాజ్ కుంద్రా ఈ నెల 19న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.