హైదరాబాద్ కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే మన తదుపరి లక్ష్యం: కేటీఆర్
- రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు
- తెలంగాణ వర్గాల్లో సంబరం
- హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
- అందరికీ అభినందనలు అంటూ ట్వీట్
తెలంగాణ నుంచి ఇదే తొలి ప్రపంచ వారసత్వ కట్టడం అని వెల్లడించారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇక రాజధాని హైదరాబాదుకు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే తమ తదుపరి లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాలు పంచుకున్నారు.