ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలు.. నాలుగు నెలల తర్వాత ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
- మార్చి 10న ఎన్నికలు
- హైకోర్టు ఆదేశాలతో అప్పట్లో నిలిచిపోయిన కౌంటింగ్
- మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు
కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. లెక్కింపులో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 47 స్థానాల్లో పోటీ చేయగా, టీడీపీ 43, జనసేన 20 చోట్ల పోటీ చేసింది. ఇతర అభ్యర్థులతో కలిసి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 30న మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది.