ఎలుకలు కొట్టేసిన రూ. 2 లక్షలలో దక్కింది రూ. 44 వేలే.. అందించిన ఆర్‌బీఐ
- కడుపులో కణతికి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు ఎలుకల పాలు
- నంబర్లు ఉన్న 88 నోట్లను గుర్తించిన తహసీల్దార్
- వీఆర్ఏను తోడుగా ఇచ్చి బాధితుడిని హైదరాబాద్ పంపిన వైనం
ఈ విషయం తెలిసిన కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలుకలు కొరికిన డబ్బులో నంబర్లు ఉన్న వాటిని గుర్తించాలని తహసీల్దార్ రంజిత్ కుమార్‌ను ఆదేశించారు. నంబర్లు ఉన్న 88 నోట్లను గుర్తించిన తహసీల్దార్ వీఆర్ఏ రాజశేఖర్‌ను తోడుగా ఇచ్చి రెడ్యాను నిన్న ఆర్‌బీఐకి పంపారు. ఆ నోట్లను పరిశీలించిన అధికారులు మొత్తం రూ. 44 వేలు చెల్లించారు.