Mangli: మంగ్లీ పాడిన బోనాల పాటపై వివాదం!

  • తెలంగాణలో బోనాలు
  • మంగ్లీ పాటపై విమర్శలు
  • కొన్ని పదాలపై అభ్యంతరాలు
  • మంగ్లీ ఎలా పాడిందంటూ భక్తుల ఆగ్రహం
Mangli Bonalu song caught in controversy

జానపద గీతాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలో ఆషాఢం బోనాల సీజన్ సందర్భంగా ఆమె పాడిన పాటపై విమర్శలు వస్తున్నాయి. ఆ పాటకు రామస్వామి సాహిత్యం అందించగా, రాకేశ్ వెంకటాపురం సంగీతం అందించారు. అయితే, ఆ భక్తి గీతంలోని కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారిని దూషిస్తున్నట్టుగా కొన్ని పదాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని, దేవతను మొక్కినట్టుగా కాకుండా, తిడుతున్నట్టుగా ఉందని, ఇలాంటి పాటను మంగ్లీ ఎలా పాడిందని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ గేయం ఉందని, మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే, ఆ పాటలోని పదాలను మార్చేయాలని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News