అఖిల్ మూవీలో పవర్ఫుల్ రోల్ .. మమ్ముట్టి కోసం ప్రయత్నాలు!
- సురేందర్ రెడ్డి నుంచి 'ఏజెంట్'
- డిఫరెంట్ లుక్ తో అఖిల్
- సాక్షి వైద్య పరిచయం
ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ ఒకటి ఉందట. కథలో కీలకమైన ఈ పాత్ర మమ్ముట్టి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. చాలాకాలం క్రితమే మమ్ముట్టి తెలుగు సినిమాలు చేశారు. 'స్వాతి కిరణం' వంటి సినిమాలో ఆయన నటనను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఇక ఆ మధ్య ఆయన 'యాత్ర' సినిమా ద్వారా ఈ తరం ప్రేక్షకులకు చేరువయ్యారు. అలాంటి మమ్ముట్టిని సురేందర్ రెడ్డి మళ్లీ తెలుగు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడన్న మాట!