జమ్మూకశ్మీర్ లో శ్రీవారి ఆలయానికి భూమిపూజ
- దేశంలో పలు చోట్ల శ్రీవారి ఆలయాలు
- రూ.33 కోట్ల వ్యయంతో జమ్మూకశ్మీర్ లో ఆలయం
- ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తిచేయాలని టీటీడీ సంకల్పం
- పునాదిరాయి వేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
- భూమిపూజకు కిషన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హాజరు
శ్రీవారి ఆలయం కోసం ప్రభుత్వం 62 ఎకరాల భూమిని 40 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఈ ఆలయాన్ని రూ.33 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. అంతేకాదు, కేవలం ఏడాదిన్నరలోనే ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది.