వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే: కేంద్రం స్పష్టీకరణ

Centre warns Whatsapp on new privacy policy
  • వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ
  • తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం
  • వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు
  • పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు
  • వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వాట్సాప్ నూతన ప్రైవసీ విధానం ఉందని పేర్కొంది.

కొత్త విధానంలో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని అభిప్రాయపడింది. వాట్సాప్ తన కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ ఇండియా విభాగానికి నోటీసులు జారీ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నూతన ప్రైవసీ విధానం వాయిదా వేసి తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరించింది.
Go Back to Shorts
Whatsapp
New Privacy Policy
Centre
IT Ministry
Notice

More Telugu News