టెలివిజన్ నటికి ప్రొఫెసర్ నుంచి అసభ్య సందేశాలు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్న నటి!
- చాటింగును బయటపెట్టిన నటి సౌందర్య
- అతడు పనిచేస్తున్న కాలేజీలోని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
- ఇలాంటి వారిని ఊరికే వదలబోనన్న నటి
ఒక మహిళతో ప్రొఫెసర్ మాట్లాడే విధానం ఇదేనా? సిగ్గుచేటు అని సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది. అతడి ప్రొఫైల్‌ను బట్టి మధురైకి చెందినట్టుగా తెలుస్తోందని, అతడు పనిచేస్తున్న కాలేజీలోని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అతడి గురించి వివరాలు రాబడుతున్నానని, అన్ని వివరాలు లభించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. అతడు పనిచేస్తున్న కాలేజీ గురించి కూడా తెలుసుకుని యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని హెచ్చరించింది.
వర్థమాన నటి అయిన సౌందర్య ఓ వైపు సీరియళ్లలో నటిస్తూనే సినిమాల్లోనూ బిజీగా మారింది. రజనీకాంత్ నటించిన ‘కబాలి’, విజయ్ ‘మాస్టర్’ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది.