Akhil: అఖిల్ కథపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయట!

  • సురేందర్ రెడ్డితో అఖిల్ మూవీ
  • మాస్ లుక్ తో కనిపించనున్న అఖిల్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
Surendar Reddy reworking on Akhil new movie script

అఖిల్ కి అనుకోకుండానే సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ వచ్చేస్తోంది. ఇంతవరకూ అఖిల్ చేసిన సినిమాలు .. ఆ సినిమాల మధ్య  వచ్చిన గ్యాప్ అభిమానులను అసహనానికి గురిచేస్తోంది. ఆయన తాజా చిత్రమైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా విడుదలకు అవకాశం లేని పరిస్థితులు కూడా వాళ్లకు నిరాశను కలిగిస్తున్నాయి. ఆ సినిమా సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ ఉండగానే, అఖిల్ .. దర్శకుడు సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

సురేందర్ రెడ్డి ఈ సారి తన స్టైల్ కి భిన్నంగా వెళ్లడమే కాదు, అఖిల్ లోని కొత్త కోణాన్ని చూపించనున్నాడు. ఇంతవరకూ అఖిల్ చేసిన ప్రతి సినిమాలోను ఆయన డీసెంట్ లుక్ తోనే కనిపించాడు. దాదాపు విదేశాల్లోనే షూటింగు జరుపుకున్న ఆ సినిమాలు, ఇది మన దగ్గర జరుగుతున్న కథ కాదే అనే ఒక ఫీలింగ్ ను ప్రేక్షకుల్లో తీసుకురావడానికి కారణమయ్యాయి. అందువలన ఈ సారి మాస్ లుక్ తో .. వాళ్లకి కనెక్ట్ అయ్యే పాత్రలో అఖిల్ ను సురేందర్ రెడ్డి చూపించనున్నాడు. ప్రస్తుతం కథపై గట్టిగానే కసరత్తు జరుగుతోందట. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ వారితో కలిసి సురేందర్ రెడ్డి నిర్మించే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News