'మండేలా' పాత్రలో హాస్యనటుడు సునీల్?
- తమిళంలో వచ్చిన 'మండేలా' సినిమా
- టైటిల్ పాత్ర పోషించిన యోగిబాబు
- రాజకీయ వ్యంగ్య చిత్రంగా గుర్తింపు
- తెలుగులో రీమేక్ చేస్తున్న అనిల్ సుంకర
పొలిటికల్ సెటైర్ గా రూపొందిన ఈ చిత్రంలో గ్రామ రాజకీయాలను ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలోని ప్రజలంతా రెండు వర్గాలుగా విడిపోవడం.. చివరికి నెల్సన్ మండేలా అనే బార్బర్ ఓటు నిర్ణయాధికారాన్ని కలిగివుండడం.. అతని ఓటు కోసం ఆయా వర్గాలు కుయుక్తులు పన్నడం.. వంటి అంశాలతో వ్యంగ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రాన్ని స్టార్ విజయ్ టీవీ ద్వారా డైరెక్టుగా విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వెంటనే నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది స్ట్రీమింగ్ అయింది.
ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అధినేత అనిల్ సుంకర రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో మండేలా పాత్రలో హీరోగా ప్రముఖ హాస్యనటుడు సునీల్ నటించనున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.