వర్ల రామయ్యకు వైసీపీ రౌడీలు ఫోన్ చేసి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: బుద్ధా వెంకన్న
- పరిషత్ ఎన్నికల అంశంలో వర్ల న్యాయపోరాటం
- వర్లను బెదిరిస్తున్నారన్న బుద్ధా వెంకన్న
- బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపించాలని డిమాండ్
- వర్లకు రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ
దళిత నాయకుడు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు వైసీపీ రౌడీలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వివరించారు. ఈ వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని బుద్ధా డిమాండ్ చేశారు. వర్ల రామయ్యకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.