పరువు నష్టం దావా కేసులో కంగనకు బెయిల్ మంజూరు
- కంగనపై జావెద్ అక్తర్ కేసు
- సుశాంత్ సింగ్ కేసులోకి కంగన అనవసరంగా లాగిందని ఆవేదన
- బెయిల్ మంజూరుకు అంగీకరించిన అంధేరి మెట్రోపాలిటన్ కోర్టు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో మిస్టరీకి సంబంధించి న్యాయం జరగాలని కంగన ట్విట్టర్ వేదికగా పలుమార్లు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆమె పలు ఛానళ్లలో దీనిపై మాట్లాడారు. ఈ సందర్భంగా కంగన తన పేరును సుశాంత్ కేసులోకి అన్యాయంగా లాగినట్లు జావెద్ ఆరోపించారు. కంగన చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు.