ఈ ఫలితాలు చూస్తుంటే టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నా: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi comments on TDP
  • ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పరాజయం
  • తండ్రీకొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాలన్న లక్ష్మీపార్వతి
  • ఎన్టీఆర్ కు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు ఎదురైందని వెల్లడి
  • నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును వదిలేయాలని సూచన
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి పరాజయంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ ఇకపై పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని వ్యంగ్యం ప్రదర్శించారు. ఒకప్పుడు తన భర్త ఎన్టీఆర్ ను అవమానించారని, ఇప్పుడదే అవమానం వాళ్లకు ఎదురైందని వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంపపెట్టు లాంటివని, నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఇంకా ఉంటే వారు చంద్రబాబును వదిలేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోలేడని, ఆయనకు మతిపోయిందని లక్ష్మీపార్వతి విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ భవిష్యత్తు ఏంటో ఊహించడమే కష్టంగా ఉందని అన్నారు. తన సుపరిపాలనతో సీఎం జగన్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడని, మరో మూడు దశాబ్దాల పాటు జగనే సీఎం అని వెల్లడించారు.
Go Back to Shorts
Lakshmi Parvati
TDP
Chandrababu
Nara Lokesh
NTR
Jagan
Municipal Elections
Andhra Pradesh

More Telugu News