బాలీవుడ్ హీరోతో కలసి ప్రభాస్ మల్టీ స్టారర్?

Prabhas multi starrer with Hritik Roshan
  • 'సలార్', 'ఆదిపురుష్' షూటింగులతో ప్రభాస్  
  • నాగ్ అశ్విన్ తో మరో ఇంటర్నేషనల్ ఫిలిం
  • ప్రభాస్, హృతిక్ రోషన్ లతో యాక్షన్ ఫిలిం
  • సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించే సినిమా    
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగుతో బిజీగా వున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న 'సలార్' ఓపక్క.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' మరోపక్క షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే ఇంటర్నేషనల్ ఫిలిం కూడా మొదలవుతుంది. ఈ క్రమంలో ప్రభాస్ మరో భారీ చిత్రాన్ని కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రం హిందీలో నిర్మితం అవుతుందనీ, మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతుందనీ అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ప్రభాస్ కలసి ఇందులో నటిస్తారని సమాచారం. పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా దీనిని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది.

బాలీవుడ్ లోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తాడట. గతంలో ఈయన వార్, బ్యాంగ్ బ్యాంగ్ చిత్రాలను రూపొందించాడు. ఇదిలావుంచితే, ప్రభాస్ ఇటీవల పూర్తిచేసిన రాధే శ్యామ్ చిత్రాన్ని జులై 30న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటించింది.
Go Back to Shorts
Prabhas
Hrutik Roshan
Siddharth Anand

More Telugu News