మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రష్మిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రష్మిక!

Rashmika dances in a music album
  • తెలుగులో టాప్ డిమాండులో రష్మిక 
  • బాలీవుడ్ సినిమాలలో కూడా నటన
  • 'టాప్ టక్కర్' ఆల్బమ్ లో డ్యాన్స్  
  • ఆల్బమ్ చేయడం ఇదే తొలిసారన్న రష్మిక 
కన్నడ బ్యూటీ రష్మిక ఈవేళ తెలుగులో టాప్ డిమాండులో వున్న హీరోయిన్. ఇటు తెలుగులో చేస్తూనే.. మరోపక్క కన్నడ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా వున్న హాట్ బ్యూటీ రష్మిక ఇటీవలే బాలీవుడ్ ప్రవేశం కూడా చేసింది. అక్కడ కూడా తన అందచందాలను ప్రదర్శించడానికి రెడీ అవుతోంది. మరోపక్క తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించడం విశేషం.

'టాప్ టక్కర్' పేరుతో సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, బాద్షా కలసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ను నిన్ననే విడుదల చేశారు.

దీని గురించి ఈ చిన్నది చెబుతూ, 'మ్యూజిక్ ఆల్బమ్ లో నేను డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం బాగుంది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూడా. ఇది త్వరలో మీ ముందుకు రానుంది. ఇకపై పెళ్లిళ్లు, కాలేజీలు.. వంటి చోట ఈ ఆల్బమ్ వినిపిస్తుందనుకుంటున్నాను.. దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నను' అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.
Rashmika Mandanna
Yuvan ShakarRaja
Music Album

More Telugu News