వృద్ధురాలి అభిమానానికి కేటీఆర్ ఫిదా!
- గంభీరావుపేటలో కేటీఆర్ పర్యటన
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
- కేటీఆర్ ను కలిసేందుకు వచ్చిన వృద్ధురాలు
- కేటీఆర్ కోసం చాలాదూరం నుంచి వచ్చానని వెల్లడి
- సెల్ఫీతో సంతోషపరిచిన కేటీఆర్
అనంతరం తన వాహనం వద్దకు వస్తుండగా ఓ వృద్ధురాలు నేరుగా కేటీఆర్ వద్దకు వచ్చింది. దాంతో ఆమెను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఏం కావాలని అడిగారు. మీతో ఓ సెల్ఫీ కోసం చాలా దూరం నుంచి వచ్చానని ఆ వృద్ధురాలు తెలిపింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మాస్కు తీసేసి తనతో ఓ సెల్ఫీ దిగాలని ఆమె కోరింది. దాంతో ఆమె కోరినట్టుగానే కేటీఆర్ ఓ సెల్ఫీ దిగి సంతోషానికి గురిచేశారు. అంతేకాదు, ఇంకేమైనా కావాలా అని ఆ వృద్ధురాలిని అడిగారు. దాంతో ఆమె.... తెలంగాణ వచ్చింది, అది చాలు అని భావోద్వేగంతో బదులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.