Tamil Nadu: అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి.. రజనీకాంత్‌ను కోరిన బీజేపీ నాయకురాలు, సినీ నటి గౌతమి

BJP leader Gauthami urges Rajanikanth to support BJP
షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లోకి రాబోనంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో సినీనటి, బీజేపీ రాజపాళ్యం నియోజకవర్గ బాధ్యురాలు గౌతమి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని రజనీకాంత్‌ను కోరారు. ఈ విషయంలో ఆయన మరోమారు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

విరుదునగర్ దక్షిణ జిల్లా నేతలు శ్రీవిల్లిపుత్తూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గౌతమి నిన్న పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాజపాళ్యం నుంచి తాను పోటీ చేసే విషయంలో స్పష్టత లేదన్నారు. అనంతరం పెద్ద మారియమ్మన్‌ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గులపోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.
Go Back to Shorts
Tamil Nadu
Actress Gauthami
Rajinikanth
BJP

More Telugu News