Sonu Sood: 'ఆచార్య' యూనిట్ కార్మికులకు సెల్ ఫోన్లు పంచిన సోనూ సూద్

  • తన దాన గుణంతో ఆకట్టుకుంటున్న సోనూ సూద్
  • ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న సోనూ
  • సెట్స్ పై 100 మందికి ఫోన్లు కానుకగా ఇచ్చిన వైనం
  • హర్షం వ్యక్తం చేసిన కార్మికులు
Sonu Sood gifted mobile phones to Acharya unit labor

చేతికి ఎముకే లేదన్నట్టుగా పెద్దమనసుతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి వార్తల్లోకెక్కారు. సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆచార్య యూనిట్ లో కార్మికులకు ఉచితంగా సెల్ ఫోన్లు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికులను గుర్తించి 100 సెల్ ఫోన్లు కానుకగా బహూకరించారు. సోనూ సూద్ నుంచి మొబైల్ ఫోన్లు అందుకున్న ఆ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెట్స్ పై సందడి వాతావరణం నెలకొంది.

More Telugu News