అల్లుడికి బహుమతిగా ఏకే-47... వైరల్ వీడియో ఇదిగో!
- పాకిస్థాన్ లో జరిగిన ఘటన
- తుపాకిని వరుడికి ఇచ్చిన మహిళ
- అది కూడా ఓ సంప్రదాయమట
పాక్ లో ఓ వివాహం తరువాత రిసెప్షన్ జరుగగా, వధూవరులు కూర్చుని ఉన్న వేళ, వరుడిని ఆశీర్వదించిన ఓ మహిళ, తన పక్కనున్నవారిని అడిగి, తను తెచ్చిన గన్ ను తీసుకుని వరుడికి ఇస్తున్న వేళ, వారంతా చప్పట్లు, కేకలతో హోరెత్తించారు. ఆ ప్రత్యేక బహుమతిని ఏ మాత్రమూ ఆశ్చర్యపోకుండా వరుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. కాగా, పాక్ లో ఓ ప్రాంత సంప్రదాయంలో ఇలా తుపాకులను బహుకరిస్తారట.