ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చేస్తామని ఒవైసీ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం: గోరంట్ల
- ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్
- ఇలాంటి వ్యాఖ్యలు ఒవైసీకి తగవన్న గోరంట్ల
- తీవ్రస్థాయిలో ఖండిస్తున్నానంటూ ట్వీట్
ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చివేస్తామనడం ఒవైసీకి తగదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని పేర్కొన్నారు. ఎన్నికలను రాజకీయంగానే చూడాలి తప్ప, ఇష్టానుసారం మాట్లాడితే ప్రజస్వామ్యం హర్షించదని తెలిపారు. ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాను అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు.