విద్యాకానుక బ్యాగ్ భుజానికి తగిలించుకుని సీఎం జగన్ చిరునవ్వులు... ఫొటో ఇదిగో!
- విద్యాకానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్లో పథకానికి శ్రీకారం
- 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లు
ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న ఆయన చిరునవ్వులు చిందించారు. జగన్ ఎంతో ఉల్లాసంగా ఉండడాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కూడా నవ్వేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
ఈ విద్యాకానుకలో భాగంగా ఓ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ ఉంటాయి. యూనిఫాం కుట్టుకూలి కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. జగనన్న విద్యాకానుక కోసం సర్కారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది.