90 శాతం వైకల్యం ఉన్నా అద్భుతం చేశాడు.. ఐఐటీలో సీటు సాధించిన ఆటో డ్రైవర్ కుమారుడు!
- అంగవైకల్యాన్ని అధిగమించి ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించిన జె.సంతోశ్
- ఆటో డ్రైవర్ కుమారుడైన సంతోశ్‌కు రెండో ప్రయత్నంలో ఈ విజయం
- అతనికి అండగా 'ఐఐటీ ఫర్ ఆల్' కార్యక్రమం, టీఎన్ వలంటీర్స్ ఎన్జీవో
- ఇంటి నుంచే చదువుకునే వీలున్న డేటా సైన్స్, అప్లికేషన్స్ కోర్సులో ప్రవేశం
పట్టుదల, సంకల్ప బలం ఉంటే వైకల్యం అడ్డుకాదని నిరూపించాడు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల జె.సంతోష్. పుట్టుకతోనే 90 శాతం స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, సెరిబ్రల్ పాల్సీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో సీటు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఒక సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడైన సంతోష్, రెండో ప్రయత్నంలో అర్హత పరీక్షలో ఉత్తీర్ణుడై, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాడు.
గతేడాది తన పాఠశాల విద్యార్థులను ఐఐటీ మద్రాస్‌కు ట్రిప్‌కు తీసుకెళ్లగా, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా సంతోష్ వెళ్లలేకపోయాడు. ఆనాటి లోటును పూడ్చుకుంటూ, ఈసారి ఏకంగా అదే సంస్థలో విద్యార్థిగా అడుగుపెట్టడం అతని అకుంఠిత దీక్షకు నిదర్శనం. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్ తన సోషల్ మీడియా ఖాతాలో సంతోష్ విజయాన్ని కొనియాడింది. "కలల మార్గం ఎప్పుడూ సులభంగా ఉండదు.. కానీ, సంకల్పం మిమ్మల్ని ఆశించిన గమ్యానికి చేర్చగలదు" అని పేర్కొంది.
టీఎన్ వలంటీర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సంతోష్ ఈ కోర్సు గురించి తెలుసుకున్నాడు. తన శారీరక స్థితికి అనుకూలంగా, ఎక్కువగా ఇంటి నుంచే చదువుకునే వీలున్న ఈ కోర్సును ఎంచుకున్నాడు. ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన 'అనైవరుక్కుమ్ ఐఐటీఎం' (అందరికీ ఐఐటీ-ఎం) అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా సంతోష్ కు ఇప్పుడు అండ లభించింది. ఈ కార్యక్రమం కింద, టీఎన్ వలంటీర్స్ సంస్థ అతనికి ఏఐ శిక్షణతో పాటు ప్రారంభ దశలో వ్యక్తిగత సహాయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజులను కూడా ఆ సంస్థే భరించనుంది. తన తరగతి నుంచి ఐఐటీ మద్రాస్‌లో ఈ కోర్సులో సీటు సాధించిన ఏకైక విద్యార్థి సంతోశ్ కావడం విశేషం.
ఏమిటీ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, సెరిబ్రల్ పాల్సీ?
అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ ప్రకారం, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన సమస్య. ఇది వెన్నుపాములోని మోటార్ న్యూరాన్లను నాశనం చేసి, కండరాల బలహీనతకు, క్షీణతకు దారితీస్తుంది. ఇక సెరిబ్రల్ పాల్సీ అనేది శాశ్వతంగా ఉండే నాడీ సంబంధిత రుగ్మతల సమూహం. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, ఇది శరీర కదలికలు, కండరాల నియంత్రణ, సమతుల్యత, భంగిమపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొని సంతోష్ సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.