భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. పిడుగు పడినా ప్రాణాలతో బయటపడ్డాడు.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు!
- న్యూయార్క్‌లో పిడుగుపాటుకు గురై బతికిన థామస్ ఫామీ
- కారుకు సమీపంలో నడుస్తుండగా కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్
- బాధితుడు యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలి కార్యాలయ సిబ్బంది అని వెల్లడి
- జీవితం పట్ల తన దృక్పథం మారిపోయిందని తెలిపిన ఫామీ
న్యూయార్క్‌లోని స్టేటెన్ ఐలాండ్‌లో ఒక వ్యక్తి చావు అంచుల దాకా వెళ్లి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. తన కారుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉండగా పిడుగుపాటుకు గురైనప్పటికీ, అతను ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ షాకింగ్ సంఘటన మొత్తం అక్కడి నిఘా కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..!
థామస్ ఫామీ అనే వ్యక్తి గత గురువారం టోడ్ హిల్ రోడ్డులో తన కారుకు 15 నుంచి 25 అడుగుల దూరంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతను నేలపై కుప్పకూలిపోయారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. పిడుగు పడిన వెంటనే తన శరీరమంతా తీవ్రమైన షాక్‌కు గురైందని, పాదాల్లో విపరీతమైన మంట, తిమ్మిరి, నొప్పి కలిగాయని ఫామీ తన అనుభవాన్ని వివరించారు.
అంత తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ, ఫామీ స్పృహ కోల్పోకపోవడం విశేషం. వెంటనే తేరుకుని, నెమ్మదిగా లేచి సహాయం కోసం సమీపంలోని ఇంటి వైపు నడిచాడు. "నన్ను కాపాడండి, కాపాడండి" అని కేకలు వినపడటంతో తాను వెంటనే బయటకు వచ్చి చూశానని, ఫామీ నేలపై పడి ఉండటాన్ని గమనించానని స్టెఫానీ హోమన్ అనే స్థానిక మహిళ తెలిపారు. ఆమె వెంటనే అతనికి సహాయం అందించారు. ఈ ఘటనలో ఫామీకి ఎలాంటి పెద్ద గాయాలు గానీ, కాలిన గాయాలు గానీ కాలేదు. అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా నార్త్‌వెల్ స్టేటెన్ ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక రాత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు.
ఫామీ, యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు నికోల్ మల్లియోటాకిస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై నికోల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. "మా కాంగ్రెస్ సిబ్బందిలో ఒకరైన థామస్, పిడుగుపాటు నుంచి సురక్షితంగా బయటపడినందుకు మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అతనికి సహాయం చేసిన మహిళకు, చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు" అని ఆమె పేర్కొన్నారు.
ఈ అనుభవం జీవితం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిందని ఫామీ చెప్పారు. "జీవితాన్ని గౌరవించాలి, అప్పుడప్పుడు ప్రశాంతంగా గాలి పీలుస్తూ నవ్వాలి. జీవితంలోని ఒత్తిళ్లు మనల్ని ముంచివేయకుండా చూసుకోవాలి" అని అన్నారు.
ఇటీవలి కాలంలో అమెరికా వ్యాప్తంగా పిడుగుపాటు ఘటనలు పెరిగాయి. ఫ్లోరిడాలో ఒక తండ్రి, మార్గేట్‌లో ఒక తల్లి, ఆమె బిడ్డ, ఇల్లినాయిస్‌లో మరో తల్లి కొడుకులు పిడుగుపాటుకు గురయ్యారు. యూఎస్ సీడీసీ ప్రకారం.. ఏటా సుమారు 37 మిలియన్ల పిడుగులు భూమిని తాకుతాయి. అయితే, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పది లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటాయని, బాధితుల్లో దాదాపు 90 శాతం మంది ప్రాణాలతో బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.